Business

టీవీ9 రవిప్రకాశ్ గుర్తున్నాడా? ఈడీ కేసులో ఇరుక్కున్నాడు.

ED Files Case On TV9 Raviprakash - Telugu Business News

టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్‌పై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి ) కేసు నమోదు చేసింది. టివి9 మాతఅ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి అనుమతుల్లేకుండా పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించినట్లు సంగతి తెలిసిందే. సెప్టెంబరు 2018 నుండి మే 2019 వరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమతుల్లేకుండా రూ. 18 కోట్ల నిధులను విత్‌డ్రా చేసినట్లు కంపెనీ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరులో ఈ విషయంలో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఇడి ఈ కేసు నమోదు చేసింది.