Sports

భారత్ క్రికెట్ పీడ విరగడైంది

భారత్ క్రికెట్ పీడ విరగడైంది

ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ తప్పుకోవడం భారత క్రికెట్‌కు శుభపరిణామం అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌ అన్నారు. శశాంక్‌ తన పదవి నుంచి వైదొలిగారని ఐసీసీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారని, త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో నూతన ఛైర్మన్‌ను ఎన్నుకుంటామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన శ్రీనివాసన్‌ ఈ విధంగా స్పందించాడు. శశాంక్‌ భారత క్రికెట్‌కు ఎంతో చేటు చేశాడని, అతను తప్పుకోడంతో బీసీసీఐతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ హర్షిస్తారని చెప్పారు.