ప్రాణాంతక కరోనా వైరస్ విరుగుడికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని, అది రోగి లోపలి రోగాన్ని నయం చేయడంతోపాటు కొన్నేళ్లపాటు ఆ రోగిలో రోగ నిరోధకశక్తి ఉండేలా చేస్తుందని ప్రొఫెసర్ సారా గిల్‌బర్ట్ గురువారం నాడు బ్రిటన్ ఎంపీలకు వివరించారు. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కలిగిన వారికి ప్రస్తుతం జబ్బు నయం అయినా మరోసారి కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఆ విషయంలో తమ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని, వాక్సిన్ వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి కొన్నేళ్ల పాటు అది శరీరంలో ఉండిపోతుందని, కరోనా మళ్లీ ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కోగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఫలితాలు
Related tags :