* హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధింపు సూచనలు.. ఇంటికెళ్తున్న ఏపీ వాసులు.. నేడూ భారీగా ట్రాఫిక్ జామ్త్వరలోనే తెలంగాణ కేబినెట్ భేటీ అయి మరోసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించనున్నదన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కనపడింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద బారీగా వాహనాలు నిలిచాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌తో పాటు, కొరపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,285 మంది నమూనాలు పరీక్షించగా 845 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 29 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 812 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,907 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 198 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7313కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 8586 మంది చికిత్స పొందుతున్నారు.
* 6 లక్షలు దాటిన కరోనా కేసులు!_దేశవ్యాప్తంగా 24గంటల్లో 19,148 కేసులు, 434మరణాలు_మహారాష్ట్రలో 8వేలు దాటిన మరణాలుదిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీటితో దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 6,04,641కి చేరింది. అంతేకాకుండా, నిన్న ఒక్కరోజే 434మంది కరోనాతో మృతిచెందారు.దీంతో దేశంలో కరోనా బారినపడి మృత్యువాతపడిన వారిసంఖ్య 17,834కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.ఇక దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,59,860మంది కోలుకోగా మరో 2,26,947మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
* ఏపి సెక్రటేరియట్ 10.ఏపి అసెంబ్లీ 2.ఏపి Tidco 7.ఇవాళ బయటపడిన పాజిటివ్ కేసులు.
* గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 434 మంది మృతి, 6,04,641కు చేరిన పాజిటివ్ కేసులు, 17,834కు పెరిగిన మృతుల సంఖ్య.
* పర్యాటకులకు శుభవార్త. గోవాలో పర్యాటకానికి ప్రభుత్వం అనుమతించింది. జులై 2 నుంచి గోవా పర్యాటకానికి అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గనోగర్ బుధవారం వెల్లడించారు. 250 హోటళ్లకు సైతం అనుమతి కల్పించినట్లు పేర్కొన్నారు. ‘పర్యాటక శాఖ నుంచి అనుమతి పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. పర్యాటకులు అనుమతి పొందిన హోటళ్లలో వసతికి ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేని హోటళ్లు ఆతిథ్యం ఇవ్వకూడదు’ అని మనోహర్ స్పష్టం చేశారు.
* సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయం, అసెంబ్లీలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. వరుసగా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇరిగేషన్ శాఖలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు నమోదుఅవడంతో ఆ శాఖలో ఉద్యోగులకు ఈనెల 14 వరకు వర్క్ ఫ్రమ్ హోంకు మౌళిక ఆదేశాలు జారీ చేశారు.