బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం అనే విషయంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బంధుప్రీతి అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ‘‘ముంబయి నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటించడానికి నేను వచ్చినప్పుడు నాకెవ్వరూ తెలియదు సరి కదా.. భాష కూడా రాదు. నాకు ఎవరితోనూ చుట్టరికం, స్నేహం అనేవి లేవు. కష్టపడి పని చేయడం మాత్రమే తెలుసు. అలాగే నేను అవకాశాలను పొందాను. ఎందుకంటే ఆయా చిత్ర పరిశ్రమల్లోని ప్రజలు నాలో ఆ దృఢ సంకల్పాన్ని చూశారు. విజయాలు, అపజయాలు ఎదురైనా శక్తిసామర్థ్యాలతోనే నా దారిలో నేను వెళ్లా. ఆశ్రిత పక్షపాతం కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే, అది నీ విజయాలు, అపజయాలను నిర్ణయించలేవు’’ అని తమన్నా అభిప్రాయపడ్డారు. తన కుటుంబంలో అందరూ డాక్టర్లేనని ఒకవేళ తాను కూడా ఆ రంగంలో ఉండి ఉంటే తన సోదరుడి నుంచి మార్గదర్శకాలు అందేవని చెప్పుకొచ్చారు. ఒకవేళ భవిష్యత్‌లో తన బిడ్డ నటుడు/నటి కావాలనుకుంటే తప్పకుండా మార్గనిర్దేశం చేస్తానని అన్నారు. అందులో తప్పేమీ లేదన్నారు.
నాకు అదొక్కటే తెలుసు
Related tags :