హిందూ మనోభావాలను దెబ్బతీసేలా సడక్-2 పోస్టర్ ఉందంటూ ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు మహేష్ భట్, నిర్మాత ముఖేష్ భట్, నటి ఆలియా భట్‌పై సెక్షన్ 120బి, 295ఎ కింద కేసు నమోదైంది. సికందర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆచార్యచంద్ర కిషోర్ అనే వ్యక్తి తన న్యాయవాది సోను కుమార్ ద్వారా కేసు నమోదు చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం కూతురు ఆలియాతో మహేష్ భట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సడక్-2 చిత్రంలో ఆలియాతో పాటు పూజా భట్, సంజయ్‌దత్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. 1991 సంవత్సరంలో విడుదలైన సడక్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆలియా భట్ చిత్రంపై కేసు
Related tags :