దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
జులై 31 వరకు ఇండియాలో అంతర్జాతీయ విమానాల నిషేధం
Related tags :