అత్యంత ఆశ్చ్యర్యకరంగా లద్దాక్ లోకి అడుగు పెట్టిన భారత ప్రధాని …. లద్దాక్ లొ అడుగుపెట్తడం ద్వారా చైనాకి పిచ్చెకిస్తున్న భారత ప్రధాని మోది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లఢక్ పర్యటనకు పూనుకున్నారు. దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన లేహ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె ఉన్నారు. నరేంద్ర మోడీ లేహ్ పర్యటనకు వెళ్తున్నట్లు చివరి నిమిషం వరకూ ఎవరికీ తెలియదు.
అనూహ్యం..అన్ ప్లాన్డ్: రక్షణ మంత్రిక్కూడా తెలియకుండా: లఢక్‌లో మోడీ: వాస్తవాధీన రేఖ వద్ద
రక్షణమంత్రికి కూడా తెలియకుండా. సంబంధించిన సమాచారం తెలియదంటే.. ఆయన ఎంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ అధినేత ఎంఎం నరవణె, ఇతర అధికారులు మాత్రమే లేహ్ పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో ప్రధానమంత్రి కూడా వారితో జత కలిశారు. ఆర్మీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వారంతా కొద్దిసేపటి కిందటే లేహ్‌కు చేరుకున్నారు.
14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్‌తో
లేహ్ చేరుకున్న వెంటనే నరేంద్ర మోడీ, బిపిన్ రావత్, నరవణె 14 కార్ప్స్ సైన్యాధికారులతో సమావేశం అయ్యారు. ఫార్మర్డ్ పొజీషన్ నీమూ ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్‌తో భేటీ అయ్యారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) లెప్టినెంట్ జనరల్ లియు లిన్‌తో ఇప్పటిదాకా మూడు దశలుగా భారత్ తరఫున చర్చకు ప్రాతినిథ్యాన్ని వహించింది హర్వీందర్ సింగే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్చల గురించి ప్రధాని ఆయనను అడిగి తెలుసుకున్నారు.
వాస్తవాధీన రేఖ వద్ద.. ఆరుబయట
రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణం.. హాట్‌స్పాట్‌గా మారిన ప్రాంతంలో నరేంద్ర మోడీ ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవాధీన రేఖ సమీపంలో ఆయన కీలక సైన్యాధికారులతో భేటీ కొనసాగిస్తున్నారు. 14 కార్ప్స్‌కు చెందిన జవాన్లు, సరిహద్దు భద్రతాధికారులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ సైనికులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆరు బయట తాత్కాలికంగా వేసిన సైనిక శిబిరంలో నరేంద్ర మోడీ ఈ భేటీని చేపట్టారు. అనేక కీలక అంశాలపై ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.
సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో..
సముద్ర మట్టానికి 11 వేల అడుగల ఎత్తులో ఈ భేటీ ఏర్పాటైంది. చుట్టూ ఝన్‌స్కార్ పర్వత శ్రేణులు.. ఇండస్ నదీ ఒడ్డున ఓ ప్రధానమంత్రి సైనికులతో భేటీ కావడం ఇదే తొలిసారి. భారత్-చైనా సరిహద్దు వివాదాలు యుద్ధ వాతావరణానికి దారి తీయడం, కిందటి నెల 15వ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య ప్రాణాంతక ఘర్షణలు చోటు చేసుకోవడం వంటి అనూహ్య పరిణామాల మధ్య నరేంద్ర మోడీ లేహ్‌లో పర్యటించడం చర్చనీయాంశమైంది.