Sports

కరోనాను జయించిన జకోవిచ్

కరోనాను జయించిన జకోవిచ్

ప్రపంచ అగ్ర ర్యాంకు టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా వైరస్‌ నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజులుగా స్వీయ నిర్భందంలో ఉంటున్న జొకోవిచ్‌తో పాటు అతడి భార్య జెలెనాకు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది.ఈ విషయాన్ని జొకో సొంత మీడియా బృందం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.. యువ టెన్నిస్‌ ఆటగాళ్లతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలువాలన్న ఉద్దేశంతో జొకో.. అడ్రియా టెన్నిస్‌ టోర్నీని నిర్వహించాడు. బెల్‌గ్రేడ్‌, జాదర్‌, క్రొయేషియాలో జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్న జొకోతో పాటు దిమిత్రోవ్‌, కోరిచ్‌, ట్రియోకి, కోచ్‌ గోరాన్‌ ఇవాన్‌సెవిచ్‌కు కరో నా పాజిటివ్‌ వచ్చింది. నిబంధనలు గాలికి వదిలేసి భౌతిక దూరం పాటించని కారణంగానే వైరస్‌ బారిన పడ్డారంటూ కొందరు జొకోపై తీవ్ర విమర్శలు చేశారు.