DailyDose

అర్చకుడితో సహా 10మంది తితిదే సిబ్బందికి కరోనా-TNI బులెటిన్

అర్చకుడితో సహా 10మంది తితిదే సిబ్బందికి కరోనా-TNI బులెటిన్

* కరోనా వైరస్‌కు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాతో మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలిని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) భావిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చర్యల్లో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం దేశ వ్యాప్తంగా 12 సెంటర్లను ఎంపిక చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉన్నాయి. ఇందులో ఎపిలోని విశాఖ కెజిహెచ్‌. తెలంగాణలోని హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి. ఈ రెండింటినీ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు ఐసిఎంఆర్‌ ఎంపిక చేసింది.

* ఏపీలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు.తొమ్మిది మంది మృతి.ఏపీలో మొత్తం 16,934కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 206 మంది మృతి.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 9,096 మంది బాధితులు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 7,632 మంది బాధితులు.24 గంటల వ్యవధిలో 38,898 మందికి కరోనా పరీక్షలు.

* 10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా.కరోనా బాధితుల్లో నలుగురు సన్నాయి వాయిద్యకారులు.ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.మరో ఐదుగురు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.సిబ్బంది నుంచి భక్తులకు కరోనా సోకకుండా చర్యలు.ఎల్లుండి టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం.

* ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్టు ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. ఎలాంటి జలుబు, జ్వరం లక్షణాలు కనిపించలేదని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే హోం క్వారంటైన్‌కు వెళ్లానన్నారు. అందరి అభిమానతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు.