DailyDose

అచ్చెన్నకు బెయిల్ నిరాకరణ-నేరవార్తలు

TNILIVE Crime News Roundup - Atchannaidu Bail Petition Rejected

* మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈఎస్‌ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు అరెస్ట్‌ కాకముందు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అచ్చన్నకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

* ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

* స్తానిక మచిలిపట్నంలో వైసిపి నేత మాజి మర్కెట్ యార్డ్ చైర్మన్ మోకా బాస్కర్ రావు హత్య కేసుతో నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగిన మోకా భాస్కరరావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు , వైసిపి కార్యకర్తలుఉల్లింగిపాలెం లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేయాలని, కొల్లు రవీంద్ర కుల ద్రోహి,కుల బహిష్కరణ చేయాలంటూ, నినాదాలు చేస్తున్న మత్స్యకారుల సంఘాలుభారీగా మోహరించిన పోలీస్ బలగాలు.

* విస్సన్నపేట(మం),చండ్రుపట్ల వద్ద భారీగా అక్రమ మద్యం పట్టివేత..తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు 720 మద్యం బాటిళ్లను ఇండికా కారులో తరలిస్తూ మండలంలోని చండ్రుపట్ల వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ వైనం..రాష్ట్ర ప్రభుత్వం మద్యం నివారణలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది.-ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ.

* విషం తాగి వ్యక్తి ఆత్మహత్య. తిరుపతి అలిపిరి సమీపంలోని సైన్స్ సెంటర్ ఎదురుగా ఘటన. సంఘటనా స్థలానికి అలిపిరి పోలీసులు.

* ఈ నెల 29న మ‌చిలీప‌ట్నంలో జ‌రిగిన వైసిపి నేత హ‌త్య‌ను ఖండిస్తున్నామ‌ని తెలుగుదేశం పార్ట మాజీ మంత్రి న‌ర‌సింహారావు, మాజీ ఎంపి కొన‌క‌ళ్ళ నారాయ‌ణరావులు పేర్కొన్నారు.

* తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మన్యంలో భారీగా గంజాయి పట్టివేత.వై రామవరం మండలం డొంకరయి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.64 లక్షల 80 విలువ గల 2160 కేజీ ల గంజాయి సీజ్.