తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహించనుంది. దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది. ఇప్పటికే 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను పెంచే అంశంపై సమావేశంలో చర్చింనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే టీటీడీ ఉద్యోగులకు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించనుంది.
భక్తుల సంఖ్య పెంచే చర్యలపై తితిదే సమావేశం
Related tags :