* మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను తుని వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి.
* పీవీపీ కోసం విజయవాడ వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.నగరంలో పలు హోటల్స్, పీవీపీ సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు.విల్లా యాజమానితో వివాదం కేసులో పీవీపీ కోసం గాలిస్తున్న పోలీసులు.
* పౌరసత్వ సవరణ చట్టంపై గత ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక మత బోధకుడు జాకీర్ నాయక్ ప్రమేయం ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
* మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య.మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు.రాజకీయపరమైన, కులపరమైన అధిపత్యపోరులో భాగంగానే పక్కా పథకంతో భాస్కరరావును హతమార్చారు.నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించాడు.రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు భాస్కరరావును హత్య చేశారు.ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశాం.వీరిలో ఒకరు కొల్లు రవీంద్ర, మరొ మైనర్ బాలుడు.అత్యవసరమైతే నాకు ఫోన్ చేయకండి, నా పీఎలలోలఎవరికైనా ఒకరికి ఫోన్ చేయండి.హత్య జరగక ముందు కూడా నిందితులు పీఎ ద్వారా రవీంద్రతో మాట్లాడారు.హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకరైన నాంచారయ్య పీఎకు ఫోన్ చేసి రవీంద్రతో మాట్లాడాడు.పనైపోయిందని నాంచారయ్య చెప్పగా జాగ్రత్తగా ఉండమని రవీంద్ర వారికి చెప్పారు.అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగింది.అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించాం.చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగింది.విచారణ జరిపి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.