Sports

లిన్‌డాన్ వీడ్కోలు

లిన్‌డాన్ వీడ్కోలు

బ్యాడ్మింటన్‌ దిగ్గజం లిన్‌డాన్‌ శనివారం ఆటకు వీడ్కోలు పలికాడు. ఫిట్‌నెస్‌ ఇబ్బందుల వల్లే నిష్ర్కమిస్తున్నానని ప్రకటించాడు. సుదీర్ఘ కాలం ఆటకు అంకితం అయ్యానని పేర్కొన్నాడు. ఇక కొనసాగలేనని వెల్లడించాడు. ‘నేను ప్రేమించే ఆటకు ప్రతిదీ అంకితమిచ్చాను. నా కష్టసుఖాల్లో కుటుంబం, కోచ్‌లు, సహచరులు, అభిమానులు నిరంతరం నాతోనే ఉన్నారు. ఇప్పుడు నాకు 37 ఏళ్లు. ఫిట్‌నెస్‌ లోపాలు, నొప్పి ఇబ్బందిగా మారాయి. నా సహచరులతో కలిసి ఆడేందుకు అవి అనుమతించడం లేదు’ అంటూ డాన్‌ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో లిన్‌డాన్‌ తనదైన ముద్రవేశాడు. ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచాడు. 2008 బీజింగ్‌, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచాడు. బ్యాడ్మింటన్‌లో కీలకమైన తొమ్మిది టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాలు ముద్దాడాడు. అతడికీ మలేసియా ఆటగాడు లీ ఛాంగ్‌ వీకి మధ్య జరిగిన పోటీలు అభిమానులను ఎంతగానో అలరించాయి.