భారతీయ రైల్వేశాఖ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల జూన్‌లో గుజరాత్‌లోని పాలంపూర్ -బొటాడ్ స్టేషన్ల మధ్య 7.57 మీటర్ల ఎత్తయిన డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు నడిపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది విద్యుత్ మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన రైలును పట్టాలపై పరుగులు పెట్టించి రికార్డు నెలకొల్పించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెండు రైళ్లను ఒక్కటిగా చేసి ఒడిశాలోని సంబల్‌పూర్ డివిజన్‌లో అనకొండ పేరుతో రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడిపి రికార్డు సృష్టించగా, తాజాగా 177 వ్యాగన్లతో ఉన్న 2.8 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును ఒకేసారి పట్టాల మీద పరుగులు పెట్టించాడు. సూపర్ అనకొండగా పిలిచే ఈ రైలు ఒడిశా బిలాస్‌పూర్ డివిజన్‌లోని లజ్‌కురా – రవుర్కెల మధ్య ఈ రైలు పరుగులు తీసింది.
డబుల్ డెకర్ భారతీయ రైలు రికార్డు
Related tags :