Food

నిమ్మకాయతో కరోనా ఖతం

Lemon helps in the battle against covid19-Telugu food and diet news

నిమ్మ పండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు, వైరస్‌కు చుక్కలే!

కరోనా వైరస్ గురించి వర్రీ కావద్దు. ఒక వేళ అది సోకినా.. దానితో పోరాడే శక్తిని ఇచ్చేందుకు నిమ్మ రసాన్ని తీసుకోండి. నిమ్మతో కలిగి మరిన్ని ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు. మరి, నిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

❂ నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.
❂ నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది.
❂ నోటి పూతకు నిమ్మ మంచి ఔషదం.
❂ నిమ్మ రసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది.
❂ బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
❂ మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు.

❂ జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి.
❂ జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది.
❂ గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

❂ నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు.
❂ చిన్న పిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్‌ సమస్యకు చెంచాడు నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణం వేసి తాగిస్తే ఫలితం కనిపిస్తుంది.

❂ నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది.
❂ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
❂ శరీరంలో వాపు, కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే కణాలను విటమిన్‌-C నిర్వీర్యం చేస్తుంది.
❂ రోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరవు.
❂ జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.

❂ దగ్గు మందుల్లో కఫాన్ని తగ్గించడానికి కూడా నిమ్మరసం కలుపుతారు.

❂ నిమ్మ ఆకుల రసానికి తేనె కలిపి ఇస్తే కడుపులో నూలి పురుగులు తగ్గుముఖం పడతాయి.
❂ గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం
❂ కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.

❂ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనను నిర్మూలించే లాలాజలాన్ని నిమ్మరసం ఉత్పత్తి చేస్తుంది.
❂ రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
❂ నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
❂ కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా బ్రష్ చేస్తే దంతాలు మెరుస్తాయి.
❂ ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది.