ఈ వారాంతంలో రెండు అంతర్జాతీయ తెలుగు సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
అమెరికాలో జులై 4, ఉదయం ప్రారంభం అవుతుంది. సిలికాన్ వేలీ నివాసి, ప్రముఖ సాహితీవేత్త, శారద కాశీవఝ్ఝుల ప్రధాన నిర్వహణలో “నభూతో అంతర్జాల అంతర్జాతీయ ద్యయాహ్న సాహితీ సదస్సు” పేరిట ఒకటి రెండు రోజుల పాటు అంతర్జాలంలో నిర్వహిస్తున్నారు.
అమెరికా లింక్:www.youtube.com/valleyvedika
సింగపూర్ లో రత్నకుమార్ ప్రధాన ఆధ్వర్యంలో “శ్రీ సాంస్కృతిక కళాసారధి” సంస్థ మొదటిసారిగా “అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం” పేరిట సింగపూర్ కాలమానం ప్రకారం జులై 5, 2020 నాడు ఉదయం 10:30కి నిర్వహిస్తున్నారు.
సింగపూర్ లింక్ – https://www.facebook.com/Sri-Samskrutika-Kalasaradhi-Singapore-108993030870390/
ఈ రెండు సభల ప్రకటనలు దిగువ చూడవచ్చు.