* పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధి నందు గల ఆనంద పేట 5వ లైన్ వార్డు వాలంటీర్ అయిన జాస్మిన్ వయసు 28 సంవత్సరాలు నాలుగు రోజులనుంచి జ్వరంతో బాధపడుతూ మరియు ఆయాసంగా ఉన్న కారణంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ అయి ఈరోజు మరణించింది.
* అనంతపురం జిల్లా ఉరవకొండలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా శనివారం మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దింతో మొత్తం పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 20కి చేరింది.
* ఏపీలో ఇవాళ 765 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు.
* కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, మంత్రులు అందరూ దీని బారిన పడుతున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎవరో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనా సోకి మృత్యువాతపడ్డారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
* దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది.నిత్యం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా గడిచిన 24గంటల్లోనే 22,771 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.దీంతో శనివారంనాటికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,48,315కు చేరింది.వీరిలో నిన్న ఒక్కరోజే 442మంది కన్నుమూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,94,227 మంది కోలుకోగా మరో 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. కేవలం శుక్రవారం ఒక్కరోజే దాదాపు 14వేల మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 60శాతం దాటడం ఊరట కలిగించే విషయం.
* ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం లో మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకి కరోనా పాజిటివ్ నమోదు.