అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గత 200రోజులుగా నిరసన చేపడుతున్న ఆ ప్రాంత రైతులకు అమెరికాలో గుంటూరు ప్రవాసుల సంఘం సంఘీభావం తెలిపింది. టెక్సాస్ రాష్ట్ర ఫ్రిస్కో నగరంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు కొమ్మినేని, శ్రీనివాస్, శివ, విష్ణు, యోగేష్, మానస, విద్య తదితరులు పాల్గొని ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, ప్రపంచంలో ఎక్కడా ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు వున్న ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై తగు విధంగా స్పందించాలని కోరారు.
అమరావతి రైతులకు గుంటూరు ఎన్నారైల సంఘీభావం
Related tags :