* గురు పూర్ణిమకు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. గురువు ఒక శిల్పి వంటి వాడు.బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. మంచి గురువు చేతిలోమలచబడేవారుఉత్తమమానవులై ,సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు. ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేథస్సు, తెలివి, నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే పూర్ణ గురువులు.విద్య బోధించేవారూ గురువులే. అయితే వారు జీవితానికి ఒక భాగాన్ని మాత్రమే అందించగలుగుతారు. జీవితానికి పరిపూర్ణత లభించేది మాత్రం పూర్ణ గురువు దగ్గరే. సంపూర్ణ జ్ఞానం పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలు, మానసిక ఒత్తిడులు, టెన్షన్లతో సమాజం స్పీడుగా వెళ్లిపోతూ ఉంటుంది. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతూ ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. రెండవది ఆధ్యాత్మిక జీవితం. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండి మనం గుర్తించక వదిలివేయబడిన చిన్న అణువు లాంటిది. అణువే అయినా దాన్ని చూడటం అంత తేలిక కాదు. దీన్ని కనుక్కోలేకపోతే, భౌతిక, ఆధ్యాత్మికాలు రెండూ ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవటం? పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపటం? భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మేరకు పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పి నిజమైన జ్ఞానాన్ని అందించేవారే రియల్ గురు. అలాంటి గురువు లభించిన వారి జీవితం ధన్యం.
* తిరుమల సమాచారం(05-07-2020)? నిన్న జూలై 04 వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 11,978 మంది… ? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 61 లక్షలు…? నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 3,918 మంది.
* శ్రీశైలమహాక్షేత్రంలో ఆషాఢపౌర్ణమి సందర్భంగా నేడు (ఆదివారం) శ్రీభ్రమరాంబాదేవి వారికి శాకంభరీ ఉత్సవం.లోకకల్యాణాన్నికాంక్షిస్తూ శ్రీభ్రమరాంబా అమ్మవారికి విశేషంగా ఉత్సవ సంబంధి పూజాదికాలు.పలురకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ.శ్రీఅమ్మవారిఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని శ్రీరాజరాజేశ్వరీదేవివారికి, గ్రామదేవత శ్రీఅంకాళమ్మ అమ్మవారికి కూడా శాకాలంకరణ మరియు విశేషపూజలు.ఉత్సవంలో వినియోగించబడుతున్న 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు.ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణములో కూడా పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణ.
* అప్పన్నస్వామికి ఇవాళ జరగనున్న ఆఖరి విడత చందన సమర్పణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన గిరి ప్రదక్షిణ, రేపు జరగబోయే ఆలయ ప్రదక్షిణ రద్దు చేశారు.భక్తులు లేకుండా స్వామివారికి ఏకాంతంగా చందన సమర్పణ చేయనున్నారు.ఆలయ ప్రదక్షిణ ఉందనుకుని భక్తులు ఎవరూ రావొద్దని దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.ఆఖరి విడత చందన సమర్పణతో స్వామి వారు పూర్తి చందన స్వామిగా దర్శనమివ్వనున్నారు.
* ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ఆంక్షల నడుమ జరుగనుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు.రోడ్డు మార్గం ద్వారా రోజుకు 500మందిని మాత్రమే మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనునట్లు జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం తెలిపింది.అమర్‌నాథ్ యాత్ర జూన్ 23న ప్రారంభమై 42 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తితో ఆలస్యమైంది.ఈ క్రమంలోనే యాత్ర జులై చివరి వారంలో ప్రారంభమై 15 రోజులే జరుగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు అమర్‌నాథ్ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు.యాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉప కమిటీ భేటీ అయ్యింది.ఈ సమావేశంలో భద్రత సహా తీర్థయాత్ర ఏర్పాట్లను సమీక్షించినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు.