టీమ్‌ఇండియాపై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో మ్యాచ్‌లు పూర్తయ్యాక భారత ఆటగాళ్లు తమను క్షమించమని అడిగేవారని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా క్రిక్‌కాస్ట్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన మాజీ క్రికెటర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన కెరీర్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లపై ఆడటం ఎంతో ఆస్వాదించేవాడినని చెప్పుకొచ్చాడు. ‘టీమ్‌ఇండియాపై ఆడటం ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. మేం వాళ్లని ఎన్నోసార్లు చాలా తేలిగ్గా ఓడించాం. దాంతో మ్యాచ్‌లు పూర్తయ్యాక వాళ్లొచ్చి మమ్మల్ని క్షమాపణలు కోరేవారు. అలా భారత్, ఆస్ట్రేలియా జట్లతో ఆడి బాగా ఎంజాయ్ చేశాను. ఆ రెండు ఉత్తమ జట్లు కాబట్టి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆయా దేశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్లో ఆడటమనేది చాలా పెద్ద విషయం’ అని అఫ్రిది పేర్కొన్నాడు.
కరోనా తగ్గింది. కుళ్లు పెరిగింది.
Related tags :