కరోనా సంక్షోభం పుణ్యమాని సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్ ఫీజుల్లో కోతలుపడే ప్రమాదం ఉంది. ‘ఇంతకు ముందు ఇచ్చినంత ఉదారంగా ఇవ్వలేం మేడమ్’ అంటూ తేల్చి చెప్పేస్తున్నాయి పెద్దపెద్ద బ్రాండ్లు. దీంతో టాప్-10లో స్థానం సంపాదించుకున్న ఆలియాభట్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌ల రాబడి భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పురుషుల విషయానికొస్తే.. విరాట్ కోహ్లి, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ భారీగా రాబడిని కోల్పోతారు. పరిశ్రమల అంచనా ప్రకారం.. ప్యూమా, బూస్ట్, మాన్యవార్ వంటి బ్రాండ్లకు ప్రమోట్ చేయడానికి కోహ్లి రూ.5 కోట్ల నుంచి 5.5 కోట్లు వసూలు చేస్తున్నారు. ఆలియాభట్.. ఫ్రూటీ, గార్నియర్, వీకో టూత్‌పేస్ట్, లేచిప్స్ నుంచి రూ.కోటి నుంచి 2 కోట్లు ఛార్జ్ చేస్తుంది. జిమ్‌ల మూసివేతతో ఫిట్‌నెస్ ఉత్పత్తులను ఎండార్స్‌చేసే కంగనా రనౌత్ రాబడికి కూడా గండి పడింది.
రాబడి పడిపోయింది
Related tags :