* గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు613 మంది కరోనా పాజిటివ్ తో మృతి,దేశ లో 6,73,165కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు19,268కు పెరిగిన కరోనా పాజిటివ్ మృతుల సంఖ్య..దేశంలో యాక్టీవ్ కేసులు 2,44,814,డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,09,083.
* ఆంధ్రప్రదేశ్‌లో మరో 961 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
* కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనాతో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి చెందాడు.మృతుడు శిరువెళ్ల మండలం ఎర్రగుంట్లలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.ఉద్యోగి మృతితో అతడి కాంటాక్ట్‌లపై అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు ఎస్‌బీఐ ఉద్యోగి కరోనాతో మృతి చెందడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.
* ఏలూరులో 18 మంది పోలీసులకు కరోనా పాజిటివ్. ప.గో జిల్లాలో పోలీసు శాఖలో కరోనా కలకలం ఆందోళన కలిగిస్తోంది.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అదేవిధంగా ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో 10 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకింది.దీంతో వారందరినీ ఏలూరు ఆశ్రమ హాస్పటల్లో ఐసోలేషన్ కి తరలించారు.ఏలూరులో 18 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది.
* కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. ఫంక్షన్లపై కూడా ఆంక్షలు విధించింది ప్రభుత్వం.. లాక్‌డౌన్ ముగిసి.. అన్‌లాక్ కొనసాగుతుండగా.. పెళ్లిళ్లకు 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తోంది ప్రభుత్వం.. ఇదే సమయంలో.. ఇతర పార్టీలు, ఫంక్షన్లు, ఎక్కువమంది గుమ్మిగూడే అవకాశం ఉన్న దావత్‌లకు అనుమతి లేదు.. ఏదైనా చేసుకున్నా.. ఆ ఫ్యామిలీ వరకే పరిమితం కావాలి.. అయితే.. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఓ పార్టీ జరిగింది.. పార్క్ హయత్ హోటల్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకున్నారు యువకులు.. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్టీ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.