Food

కోవిద్‌పై పోరుకు కొబ్బరినూనె సాయం

Coconut Oil Helps To Fight COVID19

కొబ్బరి నూనె.. వేల సంవత్సరాలుగా భారతీయులు తమ జీవితంలో ఒక భాగం చేస్తున్న వస్తువు. దీపారాధన, వంట, ఆయుర్వేదం, శరీరానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు చాలామంది ఆయుర్వేద పద్ధతులను ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయాల వంటివి సేవిస్తున్నారు. మరి కొబ్బరి నూనె సైతం కొవిడ్‌-19పై పోరుకు ఉపయోగపడనుందా?

జర్నల్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ (జాపి)లో ప్రచురించిన ఓ అధ్యయనం కొబ్బరి నూనెకు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయని పేర్కొంది. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడగలదని తెలిపింది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయాల్‌ ప్రక్రియ శరీరంలో రోగనిరోధక స్పందనకు కీలకమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వ్యవస్థను చైతన్య పరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

మానవులు, జంతువుల్లో కొబ్బరి నూనె, దాని ఉత్పత్తులు ఇమ్యూనోమాడ్యులేటరీ ఏజెంట్లుగా అత్యంత సురక్షితమని, ప్రభావవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఐతే మానవులపై ట్రయల్స్‌ కొన్నే జరిగాయని తెలిపారు. ‘కొబ్బరి నూనెపై సమీక్షకు కొవిడ్‌-19 మాత్రమే కారణం కాదు. అయితే ఈ నూనెను ఎక్కువగా వినియోగించే కేరళీయులు కొవిడ్‌-19పై బాగా పోరాడగలుగుతున్నారు’ అని డాక్టర్‌ శశాంక్‌ జోషి ఉదహరించారు.