ScienceAndTech

2021 వరకు కరోనా టీకా రాదు. లేదు. ఉండదు.

2021 వరకు కరోనా టీకా రాదు. లేదు. ఉండదు.

2021 దాకా వ్యాక్సిన్ రాదు ……

_ టీకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ..

_ కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ వివరణ …

_ ఐసీఎంఆర్‌ డెడ్‌లైన్‌పై దుమారం …

_ ట్రయల్స్‌కే తొమ్మిది నెలలు కావాలి ..

_ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడి.

కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది.

మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. 

కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది.

‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.