తమిళనాడులోని మన్నార్‌గుడి పట్టణంలో రాజగోపాలస్వామి దేవస్థానం అధికారులు 2003లో ఏనుగును కేరళ నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా ఏనుగులకు తలపై జుట్టు ఉండదు. కానీ సింగమలానికి మాత్రం మనలాగే జుట్టు ఉంటుంది. కాస్తా వైవిధ్యత ఉండటం వల్ల దేవస్థానం అధికారులు దాని కేశరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. సాధారణ రోజుల్లో రోజుకు దీనికి రెండు సార్లు స్నానం చేయించి, తల దువ్వుతారట. వేసవికాలంలో అయితే రోజుకు ముమ్మారు స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే. గతంలోనూ ఈ ఏనుగు ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. కానీ, తాజాగా మరోసారి ఫోటోలు పోస్టు చేయడంతో ఆ ఏనుగు విశిష్ఠతలు ఏంటా అని నెటిజన్లు శోధిస్తున్నారు.
ఈ ఏనుగుది స్పెషల్ హెయిర్‌స్టయిల్
Related tags :