‘‘నేనూ నెపోటిజం బాధితురాలినే’’ అని అంటున్నారు తాప్సీ. ఉత్తరాది భామ అయినప్పటికీ దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు ఉన్నా చెప్పుకోదగ్గ చిత్రాలు చేయలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌ను నమ్ముకున్నారు. కథా బలమున్న చిత్రాలు చేస్తూ, స్టార్ కథానాయికగా రాణిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ మొదలైంది. బాధితులంతా గళమెత్తి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తాప్సీ కూడా బంధుప్రీతి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారికి అవకాశాలు సులభంగా వస్తాయి. ఏ నేపథ్యం లేకుండా వచ్చినవారికి పరిచయాలు ఏర్పడటానికి సమయం పడుతుంది. దీనివల్ల దర్శకులు బయటి నుంచి వచ్చిన వారికన్నా ప్రముఖుల వారసులతో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతారు. పరిచయాలు, లౌక్యం లేక నేనూ చాలా అవకాశాలు కోల్పోయాను. అప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను. ఇలాంటి సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమే! స్టార్‌డమ్, బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వారి చిత్రాలు చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’’ అని తాప్సీ అన్నారు.
నా అవకాశాలు అలా పోయాయి
Related tags :