Politics

ఆహ్లాదకరంగా ఉండాలి

YS Jagan Orders The Colors Must Be Soothing

విద్యాశాఖలో మనబడి, నాడు-నేడుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ మంత్రి సురేశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాడు – నేడు కింద చేపట్టిన పనులు, భవనాల రంగులపై చర్చించారు. రంగుల నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. పాఠశాల భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని జగన్‌ సూచించారు.