టిబెట్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా సూచించింది. తీరు మార్చుకోకపోతే ఆ దేశ దౌత్యాధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికా దౌత్యాధికారులు, జర్నలిస్టులు, పర్యాటకులను టిబెట్‌లోకి చైనా అనుమతించకపోవడంపై అమెరికా మండిపడుతున్నది. టిబెట్ చట్టం పేరుతో చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో చైనా అధికారుల వీసాలను పరిమితం చేస్తామని ఆయన చెప్పారు.
అమెరికా…నీ వీసాలు తెగ్గోస్తాం జాగ్రత్త!
Related tags :