WorldWonders

నేను కేరళలోనే ఉండిపోతాను

నేను కేరళలోనే ఉండిపోటాను

ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులంతా తమ దేశాలకు వెళ్లేందుకు తహతహలాడుతుంటే.. 74 ఏళ్ల ఓ అమెరికా పౌరుడు మాత్రం తనను ఇక్కడే ఉండనివ్వాలంటూ న్యాయపోరాటానికి దిగాడు. ఐదు నెలల పాటు కేరళలో నివాసం తనకు ఎనలేని మనశ్శాంతిని ఇచ్చిందనీ.. ఇక జీవితాంతం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని జానీ పాల్ పియర్స్ అనే వృద్ధుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తన టూరింగ్ వీసాను బిజినెస్ వీసాగా మార్చునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించాడు.