* ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టు లో మాండమస్ పిటిషన్ దాఖలుపిటీషన్ దాఖలు చేసిన నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న…ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుండి సీఎం ఫామౌస్ కి వెళ్లారని పేర్కొన్న పిటీషనర్..ముఖ్యమంత్రి ఫామౌస్ కు వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోందని పేర్కొన్న పిటిషనర్…ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం తెలియాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉందన్న పిటీషనర్…ముఖ్యమంత్రి గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని పేర్కొన్న పిటీషనర్…ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదన్న పిటీషనర్…గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని పేర్కొన్న పిటీషనర్.
* తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.పోలీసులు ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు.తాజాగా అన్నా డీఎంకే సీనియర్ నేత విద్యుత్ శాఖ మంత్రి తంగమనికి కరోనా అని నిర్ధారణ అయింది.
* అంతరాష్ట్ర సరిహద్దు పొందుగల పోలీస్ చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రూరల్ ఎస్ పి విశాల్ గున్ని. పొందుగల చెక్ పోస్ట్ ఆంధ్ర రాష్ట్రంకు చాలా ముఖ్యమైన చెక్ పోస్ట్.సరిహద్దు దాటి వచ్చే వారికి ఈ పాస్ ఖచ్చితం.పాస్ లేకుండా అనుమతి లేదు.కోవిద్ ఎక్కువగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ ల నుండి వచ్చే వారికి స్వాప్ టెస్ట్ పొందుగల కోవిద్ కమాండ్ సెంటర్ వద్ద కంపల్సరీ. ప్రతి రోజు ఈ పాస్ తో మూడు వందల నుండి నాలుగు వందల వాహనాలు సరిహద్దు దాటుతున్నాయి.అక్రమ మద్యం, నాటు సారా, అక్రమ ఇసుక రవాణా కు ఈ చెక్ పోస్ట్ చాలా కీలకమైనది.సరిహద్దు వద్ద పోలీసులు చాలా సిస్ట మాటిక్ పనిచేస్తున్నారు.పోలీస్ వారి పనితీరు బాగుంది. వారికి నా అభినందనలు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారు పోలీసులకి సహకరించాలి.స్పందన పాస్ ఉంటే వెంటనే పంపిస్తారు.
* అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం – అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం తరపు న్యాయవాది – అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలన్న ప్రభుత్వ న్యాయవాది – వెంటనే ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు – అచ్చెన్నాయుడును గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించే అవకాశం.
* నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ పునర్‌నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ‘హైకోర్టు ఆదేశాలతో గతంలోని అధికారులూ విధులు నిర్వర్తించలేక పోతున్నారు. మధ్యంతరంగా ఎస్‌ఈసీని నియమించేలా గవర్నర్‌కు సూచించాలి’ అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ‘గవర్నర్‌కు ఇప్పుడు సూచన చేయలేం. రెండు నుంచి మూడు వారాల్లో విచారణ ముగించాలని భావిస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదు’ అని సీజేఐ జస్టిస్ బొంబ్డే స్పష్టం చేశారు.
* గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌ల విషయంలో వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా ఈ కమిటీలో భాగంగా ఉండనుంది. ఈ విషయాల్ని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు.
* ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు మొత్తం లాక్‌డౌన్ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కరీంనగర్‌లో మాట్లాడారు. కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. పరీక్షలు చేయట్లేదు.. డేటా దాస్తున్నారని విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని ప్రశ్నించారు.
* ఏపీలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరింది. వీరిలో 11,101 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా..8,518 మంది వివిధ ఆస్పత్రుల్లోనూ, 2,376 మంది కొవిడ్ కేర్‌సెంటర్లలోనూ చికిత్స పొందుతున్నారు. తాజాగా 12 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నవ్యాంధ్రలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు స్పందించారు. జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. పార్లమెంటు స్థానం ప్రాతిపదికన జిల్లాను విడదీయవద్దని అన్నారు.
* మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. దీనిలో భాగాంగా వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఆయా కంపెనీలకు ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోసం 1.2బిలియన్ డాలర్లను అందించిన అమెరికా, మరో కంపెనీకి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నోవావాక్స్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, కోసం 1.6బిలియన్ డాలర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.
* అక్రమంగా నడిపే ఆశ్రమాలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలని సొలిసిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. బోగస్ బాబాలు నిర్వహిస్తున్న ఆశ్రమాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన దుంపాల రాంరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురు దిల్లీలోని ఓ ఆశ్రమంలో దొంగ బాబా చేతుల్లో చిక్కుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
* దేశ రాజధాని దిల్లీలో కరోనా చికిత్స కోసం వెయ్యి పడకల ఆసుపత్రి సిద్ధమైంది. 12 రోజుల రికార్డు స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్మించింది. ఆసుపత్రిలో సాంకేతిక హంగులు, రోబోలతో సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రిలో ఆధునిక వంటగది ఏర్పాటు చేశామన్నారు. పూర్తిగా స్వదేశీ పరికరాలతోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో రోజురోజుకీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడికి పోలీస్ శాఖలో ఉన్న నెట్‌వర్క్‌ను, ప్రాబల్యాన్ని చూసి ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. వికాస్ దూబే కోసం పోలీసులు 40 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. అయినా, అతని ఆచూకీ చిక్కడం లేదు. నిన్న ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ, పోలీసులు అక్కడికి చేరుకునే లోపే అతడు పరారయ్యాడు.
* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయి 36,329 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద ముగిశాయి. ఎంఎంటీసీ, హింద్ కాపర్, సెంచురీ ప్లైబోర్డ్స్, స్టీల్ అథారిటీ, బిర్లా సాఫ్ట్ షేర్లు లాభాల్లో ఉండగా.. ప్రజిమ్ జాన్సన్, త్రివేణీ టర్బైన్, ప్రస్టీజ్ ఎస్టేట్, డిష్మన్ కార్బోజన్, శంకర బిల్డింగ్స్ షేర్లు నష్టపోయాయి.