DailyDose

ప్రపంచ కరోనా బాధితుల సంఖ్య 1కోటి18లక్షలు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - Global COVID19 Patients Number Crosses 1Crore

* ఏపీలో కొత్తగా 1,062కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఏపీకి చెందినవారు 1,051 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 9మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 22,259 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 264 మంది మృతి చెందారు. 10,894 మంది చికిత్సపొందుతుండగా, 11,101 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

* ప్రపంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య ఒక కోటి 18 ల‌క్షలు దాటింది.ఇప్పటివ‌ర‌కు క‌రోనాతో 5ల‌క్షల 43 వేల 433 మంది మ‌ర‌ణించారు.విశ్వవ్యాప్తంగా ఇప్పటివ‌ర‌కు ఒక కోటీ 18 ల‌క్షల 41 వేల 627 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.30 ల‌క్షల 59 వేల 428 క‌రోనా పాజిటివ్ కేసుల‌తో అమెరికా అగ్రస్థానంలో కొన‌సాగుతోంది.ఆ దేశంలో ఇప్పటివ‌ర‌కు క‌రోనా కార‌ణంగా ల‌క్షా 33 వేల 347 మంది మ‌ర‌ణించారు.16 లక్షల 43 వేల 539 మంది బాధితులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.ఆ దేశంలో 66 వేల 93 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.కోవిడ్‌-19 కేసుల సంఖ్యలో భార‌త్ మూడో స్థానంలో.. రష్యా నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.ఆ దేశంలో ఇప్పటివ‌ర‌కు 6 ల‌క్షల 94 వేల 230 కేసులు న‌మోద‌య్యాయి.

* జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ త‌న‌కు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అధికారులు, సిబ్బందిని కూడా హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సీఎం సూచించారు.ఇక సీఎం కార్యాల‌యం వ‌ద్ద రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు.ఆ రాష్ర్ట మంత్రి మిథిలేష్ ఠాకూర్ కు మంగ‌ళ‌వారం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.ఇటీవ‌లే ఆ మంత్రి.. సీఎం సోరెన్ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.