Movies

₹2కోట్లు ఇస్తే…ఒకటి పెడుతుంది

₹2కోట్లు ఇస్తే…ఒకటి పెడుతుంది

సమాచారాన్ని పంచుకోవడానికి, అభిప్రాయాల వ్యక్తీకరణకు సోషల్‌మీడియా చక్కటి వేదికగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీలకు మాత్రం సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారీ ధనార్జనకు రాజమార్గాలుగా మారాయి. బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కపోస్ట్‌కు రెండుకోట్ల రూపాయల్ని ఆర్జిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఐదున్నర కోట్లకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తుండటంతో ఈ సుందరికి ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఏర్పడింది. దీంతో పలు అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ ఉత్పత్తుల ప్రచారానికి ప్రియాంకను సంప్రదిస్తున్నాయట. ఒక్క ప్రమోషనల్‌ పోస్ట్‌కు 2కోట్లు సంపాదిస్తూ భారత సినీతారల్లో మొదటిస్థానంలో నిలిచింది ప్రియాంకచోప్రా. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రపంచ సెలబ్రిటీల్లో ప్రియాంకచోప్రా 28వ స్థానంలో కొనసాగుతోంది. ఇక హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ ఒక్కపోస్ట్‌కు 8కోట్లు సంపాదిస్తూ వరల్డ్‌ నెంబర్‌వన్‌గా ఉన్నారు.