అమెరికా తెలుగు సంఘం(ఆటా) “ఝుమ్మంది నాదం” పాటల పోటీలను జూన్ 28,2020 నుండి ఆగష్టు 2, 2020 వరకు నిర్వహించనున్న సందర్భంగా జూన్ 28న సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్, జులై 4, 5 తేదీలలో జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను జూమ్ ద్వారా నిర్వహించారు. 82 మంది ప్రవాసులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గాయని గాయకులు అమెరికాలో పలు రాష్ట్రాలనుండి ఆసక్తితో పాల్గొన్నారు. ఆటా ట్రస్టీ రామక్రిష్ణారెడ్డి ఆళ్ల, పోటీల నిర్వహణ ఛైర్ శారదా సింగిరెడ్డి సమన్వ్యకర్తలుగా వ్యవహరించారు. వాసగోపినాధ్ రావు, శ్రీని ప్రభల, రాజశేఖర్ సూరిభొట్ల, నిహాల్ కొండూరి, నూతన మోహన్, మానస ఆచార్య, ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అమ్రిత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి ఓత్ర, మిత్ర చెబియం, పర్ణిక వుల్లగంటి, శరణ్య ఎస్, తన్వి గొంగల, వైష్ణవి రెండుచింతల తుదిసమరానికి ఎంపిక అయ్యారు. ఆటా అధ్యక్షుడు భీమిరెడ్డి పరమేశ్, తదుపరి అధ్యక్షుడు బూజాల భువనేశ్‌లు విజేతలకు అభినందనలు తెలిపారు.
ఆటా “ఝుమ్మంది నాదం” ఫైనలిస్ట్‌లు వీరే
Related tags :