Health

ఏపీలో భారీగా విస్తరిస్తున్న కరోనా-TNI బులెటిన్

ఏపీలో భారీగా విస్తరిస్తున్న కరోనా-TNI బులెటిన్

* వైరస్ కారణంగా మరో 13 మంది మృతిరాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి.తాజాగా 13 మంది మృతి చెందగా… మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి కరోనా సోకింది.విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది.కరోనా నుంచి కోలుకుని మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు.ప్రస్తుతం ఆస్పత్రిలో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.ఇప్పటివరకు 11,101 మంది డిశ్ఛార్జి అయ్యారు.

* గుంటూరు నగరములో వార్డు సచివాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్.103 శ్యామల నగర్ సచివాలయం సెక్రటరీకి కరోనా పాసిటీవ్.మొన్న పట్టాభిపురం మున్సిపల్ స్కూల్ లో టెస్టు చేయగా నిన్న సాయంత్రం రిపోర్ట్ లో పాసిటీవ్ కేసు అని నిద్దారణ అయింది.వార్డు సిబ్బంది మరియు సచివాలయానికి వచ్చినా ప్రజలు పై అరా తీస్తున్నారు.

* పొన్నూరులో ముగ్గురు విలేకర్లకు కరోనా పాజిటివ్.ఒక విలేకరితో సన్నిహితముగా మెలిగిన బాపట్లకి చెందిన వైసీపీ చోటా నేత? ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ప్రైమరి మరియు సెకండరి కాంటాక్ట్స్లోబాపట్ల వాసులు ఉన్నట్లు సమాచారం.

* ★ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 210 బులిటెన్ విడుదల..!!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది.

★ గడచిన 24 గంటల్లో 16,882 మంది నమూనాలు పరీక్షించగా 1555 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

★ అయితే, వీటిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 53 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 1500 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

★ పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 23,814 కేసులు నమోదయ్యాయి.

★ కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరియు చిత్తూరులో ఒక్కరు మృతి చెందారు.

★ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 277 చేరింది.

★ ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 12,154 కి చేరింది.

★ ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,383 మంది చికిత్స పొందుతున్నారు.