Health

రోజా గన్‌మెన్‌కు కరోనా-TNI బులెటిన్

రోజా గన్‌మెన్‌కు కరోనా-TNI బులెటిన్

* ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్ మెన్ కు కరోనా. తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి తరలింపు.

* ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలను దాటింది. చిత్తూరు జిల్లాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 2,200 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా నగరిలో ఒకే కుటుంబంలో 22 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 84 ఏళ్ల వయసున్న ఒక ప్రముఖ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో నిన్న వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఆయనది ఉమ్మడి కుటుంబం. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో పట్టణంలోనే పెద్ద కుటుంబంగా పేరుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏపీలో 1,576 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 32 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 25,422కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కోవిడ్ వల్ల 15 మంది మృతి మృతిచెందగా.. మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 292 మందికి చేరింది. ప్రస్తుతం ఏపీలో 11,936 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 13,194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

* ఏపీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతదేహాలను జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నెల్లూరు జిల్లాలో వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియాల్లో ప్రభుత్వ సిబ్బంది కనీస మానవత్వం చూపించకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది.

* హిందూపురం లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా. రెండు రోజుల్లో 13 కేసులు నమోదు.

* ఏపీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ, సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు 38కి చేరుకున్నాయి.