తల్లిదండ్రుల పుణ్యతిథి ఇంట్లోనే చేయాలన్న నియమం ఏమీ లేదు. నదీ తీరంలోనూ నిర్వహించొచ్చు. ఇంకా చెప్పాలంటే నదీ తీరంలో చేయడమే మంచిదని శాస్త్రం నిర్దేశిస్తోంది. నదీతీరాన ఉన్న పుణ్యక్షేత్రమైతే మరింత విశేషమన్నారు పెద్దలు. తీర్థమూ, క్షేత్రమూ కలిసిన చోట నది పవిత్రత, అక్కడి దైవం దీవెనలు కూడా పితృకార్యం సక్రమంగా జరగడానికి దోహదం చేస్తాయి. శ్రద్ధతో నిర్వహించేది శ్రాద్ధం. మనకు జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులపై కృతజ్ఞతతో మెలగాలి. వారు గతించిన తర్వాత భక్తితో వారి పుణ్యతిథిని నిర్వహించి, పితృదేవతల దీవెనలు అందుకునే కార్యక్రమం శ్రాద్ధం. ఈ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత మరింత స్థిరం కావటానికి ఇంటి కన్నా.. నదీ తీరం గొప్పదని ఇందులోని అభిప్రాయం.
శ్రాద్ధం ఇంట్లో పెట్టవచ్చా?
Related tags :