టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 20 మందికి పైగా వారసత్వ అర్చకులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా విధుల నుంచి తొలగించారని చెప్పారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. మమ్మల్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని జగన్ కూడా మాట ఇచ్చారని చెప్పారు. కానీ టీటీడీ ఈవో, ఏఈవో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలనే పాటిస్తున్నారని… హైకోర్టు, జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించడం లేదని విమర్శించారు. తాము ఇంకా వేచి చూస్తున్నామని చెప్పారు. తన ట్వీట్ కు జగన్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిలను ఆయన ట్యాగ్ చేశారు.
తితిదే ఈవోకు ఇంకా చంద్రబాబే ముఖ్యమంత్రి

Related tags :