పట్టుచీర… బంగారపు వడ్డాణం గొప్ప కాంబినేషన్! కానీ పసిడి వడ్డాణం కొనుక్కోవడం అందరివల్లా అవ్వదు కదా. పోనీ వన్‌గ్రామ్‌తో సరిపెట్టుకుందామనుకున్నా బరువు, అసౌకర్యం వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడా ఇబ్బందులేవీ లేకుండా.. చీరకట్టు అందాన్ని మరింత పెంచుతున్నాయి శారీబెల్టులు. చీరలోని అంచుకు మ్యాచ్ అయ్యేవిధంగా వస్త్రంతో తేలిగ్గా ఉండేలా వీటిని డిజైనర్లు రూపొందిస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మెరిసిపోవడానికి ఈ బెల్టులు భలేగా ఉపకరిస్తున్నాయి.
వడ్డాణం బంగారమే కానక్కర్లేదు
Related tags :