వికాస్ దూబే ఆస్తులు చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు!
ఎన్ కౌంటర్ లో హతుడైన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులను అంచనా వేసే పనిలో ఈడీ నిమగ్నమైంది. దూబే కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల నుంచి ఈ మేరకు వివరాలు రాబట్టేందుకు ఈడీ పోలీసు అధికారుల సాయం తీసుకుంటోంది. దూబే ఆస్తులపై ప్రాథమికంగా తెలిసిన వివరాలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
అధికార వర్గాల సమాచారం ప్రకారం… వికాస్ దూబే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్ లాండ్ దేశాల్లో ఖరీదైన పెంట్ హౌస్ విల్లాలు కొనుగోలు చేశాడు. గత మూడేళ్ల వ్యవధిలో 14 సార్లు విదేశాలకు వెళ్లొచ్చాడు. ఇటీవలే లక్నోలోని ఆర్యానగర్ లో రూ.23 కోట్ల వ్యయంతో విలాసవంతమైన బంగ్లా కొన్నాడు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దూబేకు బినామీ పేర్లతో 11 సాధారణ గృహాలు, 16 ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయి. ఇవే కాక, లోతైన దర్యాప్తు జరిపితే మరిన్ని ఆస్తుల వివరాలు బయటికి వస్తాయని ఈడీ భావిస్తోంది.