బెడ్‌రూమ్ అనేది.. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచే గది. దీన్ని ఎంత చక్కగా అలంకరిస్తే అంత మంచిది. అందుకే మీ బెడ్‌రూమ్‌లో రోజ్ క్వార్ట్‌జ్ క్రిస్టల్‌ని పెట్టుకోండి. ఈ క్రిస్టల్ ఉన్న చోట ప్రేమ పదిలంగా ఉంటుందనేది నమ్మకం.నైరుతి వివాహానికి, ప్రేమకి, శృంగారానికి కలిసొచ్చే దిశ. అక్కడ ఈ క్రిస్టల్ ఉంచడం వల్ల బంధం బలపడుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. పింక్ క్రిస్టల్స్‌ను బెడ్‌రూమ్‌లోని నైరుతి మూలన పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుందని అంటారు. బెడ్ పక్కన టేబుల్ మీద ఒక గాజు బౌల్‌లో మంచినీరు పోసి అందులో ఈ క్రిస్టల్‌ని పెడితే.. అది దంపతుల ఒత్తిడి, ఘర్షణని తగ్గించి ప్రేమనూ, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే, ప్రతివారం మర్చిపోకుండా నీటిని మారుస్తూ ఉండాలి. గ్లాస్ బౌల్, టేబుల్ కూడా శుభ్రంగా ఉండాలి. రోజ్ క్వార్ట్‌జ్ ఆర్గోన్ పిరమిడ్‌ని కూడా బెడ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. దీన్ని నైట్ స్టాండ్ కింద కానీ, బెడ్ పక్కన స్టడీ టేబుల్ కింద కానీ పెట్టండి. ఎట్టిపరిస్థితుల్లోనూ మెటల్ టేబుల్ మీద పెట్టొద్దు. చెక్క టేబుల్ అయితే ఉత్తమం. హార్ట్ షేప్డ్ క్రిస్టల్ ఇద్దరి మధ్యా ప్రేమని పెంచుతుంది.
పడకగదిలో రోజ్ క్రిస్టల్స్‌తో ప్రయోజనాలు
Related tags :