Movies

సుష్మిత కొణిదెల నిర్మాణంలో…

సుష్మిత కొణిదెల నిర్మాణంలో…

చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్మాణ సంస్థను ఆమె నెలకొల్పారు. ఒక క్రైం డ్రామా వెబ్‌ సిరీస్‌ రూపొందించేందుకు జీ5 ఓటీటీతో అనుసంధానమయ్యారు. దీనికి ఆనంద్‌ రంగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌, కొంత మంది కరుడు గట్టిన నేరస్థుల కథల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ… శనివారం ఈ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణను ప్రారంభించారు.