కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంపై హిందూ సాంప్రదాయం ప్రకారం ట్రావెన్ కోర్ రాజవంశస్ధులకే హక్కులు కల్పిస్తూ.. కొద్దిసేపటి క్రితం సుప్రీం కోర్టు తీర్శు వెలువడింది… లక్షల కోట్ల విలువైన సంపద ఉన్నఈ ఆలయం నిర్వహణ, ఆస్ధులపై సుప్రీంలో 9 ఏళ్ల క్రితం కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కీలకమైన కేసుకు సంబంధించి…. చరిత్రాత్మకమైన ఆలయం ఆస్తుల్లో.. ట్రావెన్‌కోర్ రాచ కుటుంబానికి హిందూధర్మ చట్టం ప్రకారం హక్కులు ఉన్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకరి మరణం వల్ల దైవారాధనకు చెందిన హక్కులు ఆ కుటుంబంపై ప్రభావం చూపవని, ఇది ఆచారం ప్రకారం కొనసాగుతుందని సుప్రీం పేర్కొన్నది. దేవుడి ఆస్తులపై రాజ కుటుంబానికి ఆచారం ప్రకారమే హక్కు ఉన్నట్లు కోర్టు వెల్లడించింది. ఆలయ నిర్వహణపైన కూడా సుప్రీం తీర్పునిచ్చింది. తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి.. కొత్త కమిటీ ఏర్పాటు చేసే వరకు ఆలయ నిర్వహణను ఆ కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్న రెండవ నేలమాలిగలో మరింత విలువైన సంపద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పద్మనాభస్వామి కేసు ఆసక్తికరంగా మారింది. ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్పందించలేదు. ఇవాళ్టి తీర్పులో ఆ అంశాన్ని కోర్టు స్పృశించలేదు. జస్టిస్ ఉదయ్ యూ లలిత్, ఇందూ మల్హోత్రలకు చెందిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
అనంత పద్మనాభాలయ హక్కులు రాజవంశానివే!
Related tags :