ఇషాన్ ఖట్టర్, టబు ప్రధాన పాత్రల్లో విక్రం సేత్ నవల ఆధారంగా రూపొందుతున్న మినీ సిరీస్ ‘ఏ సూటబుల్ బాయ్’. మీరా నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కపూర్, తాన్య మణిక్తల, రాశిక దుగల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇందులో టబు వేశ్యగా నటిస్తున్నారు. ట్రైలర్లో ఇషాన్ ఖట్టర్, టబుల మధ్య జరిగే శృంగార సన్నివేశాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హీరో ఒక వేశ్య అందానికి ఎలా ఫిదా అయ్యాడనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఇది లక్నో, మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. జులై 26న బీబీసీ వన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వేశ్యగా…
Related tags :