Politics

కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఆగకూడదు

కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఆగకూడదు

ఒప్పంద ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఒప్పంద ఉద్యోగుల స్థితిగతులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జీతాల పెంపుతో ఖజానాపై రూ. వెయ్యి కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఒప్పంద ఉద్యోగులను గ్రీన్‌ ఛానల్లో పెట్టి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని సీఎం ఆదేశించారు. సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని సూచించారు. వీటిపై నివేదికలు త్వరగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.