* రాజస్థాన్‌లో తాజా పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. ఈ సమయంలో సచిన్ పైలట్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మథూర్ ప్రకటించారు. అంతేకాకుండా భాజపా విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చని ఆయన స్పష్టంచేశారు.
* వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఆయనకు ఇప్పుడు కొవిడ్ ఐసోలేషన్‌లో ఉండటం చిరాగ్గా ఉంది. దీంతో మరోసారి కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమవారం నిర్ణయించుకొన్నారు. దీనిపై ఇటీవల సీఎన్ఎన్ బ్రెజిల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మంగళవారం మరోసారి కరోనా పరీక్ష ఉంది. దానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. నేను చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఈ రకంగా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. భయంకరంగా ఉంది. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. బాగానే ఉన్నాను. రేపు చేసే పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదు. నేను మళ్లీ నా విధులను ప్రారంభించాలి. కానీ, నా చుట్టుపక్కల వారిని కూడా పట్టించుకోవాలిగా. అందుకే ఫలితం భిన్నంగా వస్తే మరికొన్ని రోజులు ఎదురుచూస్తాను. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ల్లో విధులు చక్కబెడుతున్నాను ’’ అని ఆ ఫోన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
* కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్ వణికిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ రానున్న రోజుల్లో మరింత ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో(వచ్చే జనవరి-ఫిబ్రవరి) వైరస్ రెండో దఫా(సెకండ్ వేవ్) విజృంభిస్తే మాత్రం దాదాపు మరో లక్షా 20వేల మంది మృత్యువాతపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
* రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రతిపాదనకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేశ్ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు. సీఎల్పీ సమావేశంలో సచిన్‌కు ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేసిన తర్వాత గహ్లోత్ నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సచిన్, మంత్రులను తొలగించాలనుకుంటున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు.
* కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టు పేర్కొంది. ఎస్ఎస్సీ, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.
* రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంపై సచిన్ పైలట్ స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు’ అంటూ ట్విటర్లో స్పందించారు. అయితే పార్టీ మారే విషయంపై ఆయన స్పందించలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై సాయంత్రంలోపు ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* ఈఎస్ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై వాదనలను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మరోవైపు ఏసీబీ అదుపులో ఉన్న అచ్చెన్నాయుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
* ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఫేక్ ట్వీట్లు పెడుతున్నారని తెదేపా నేత నారాలోకేశ్ విమర్శించారు. ఫేక్ ట్వీట్లు పెట్టి, మూడు ముక్కలాటతో వైకాపా సాంధించిందేమిటని ప్రశ్నిస్తూ.. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. మూడు ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనతోపాటు తెదేపా అధినేత చంద్రబాబు పేరిట ట్విటర్లో ఫేక్ పోస్టులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
* రాజస్థాన్‌లో తాజా పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. ఈ సమయంలో సచిన్ పైలట్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మథూర్ ప్రకటించారు. అంతేకాకుండా భాజపా విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చని ఆయన స్పష్టంచేశారు.
* ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలపై పోరాడేందుకు అగ్రరాజ్యంలోని డజన్‌కుపైగా పెద్ద టెక్నాలజీ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఇటీవల ఐసీఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ వేసిన దావాలో టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లాంటి కంపెనీలు చేరాయి.
* కరోనా వైరస్ నుంచి తమ వినియోగదారులు, ఉద్యోగులను కాపాడుకొనేందుకు సంస్థలన్నీ భిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మరో అడుగు ముందుకేసింది. తమ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా (వర్క్ ఫ్రం ఎనీ లొకేషన్) పనిచేసే వ్యవస్థను తీసుకురానుంది. వినియోగదారుల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించనుంది.
* భారత వార్తా ఛానెళ్లపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం పాక్షికంగా తొలగించింది. ఈ మేరకు నేపాల్ టెలివిజన్ కేబుల్ ఆపరేటర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కొన్ని వార్తా ఛానెళ్లపై మాత్రం నిషేధం కొనసాగుతుందని నేపాల్ టీవీ ఆపరేటర్స్ ఉపాధ్యక్షుడు దుర్గా శర్మ తెలిపారు.
* కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్ వణికిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ రానున్న రోజుల్లో మరింత ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో(వచ్చే జనవరి-ఫిబ్రవరి) వైరస్ రెండో దఫా(సెకండ్ వేవ్) విజృంభిస్తే మాత్రం దాదాపు మరో లక్షా 20వేల మంది మృత్యువాతపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.