DailyDose

కరోనాతో సీఐ మృతి-నేరవార్తలు

కరోనాతో సీఐ మృతి-నేరవార్తలు

* అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐ గా నిధులు నిర్వర్తిస్తున్న సీఐ రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు.స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు.సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

* అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వే కాలనీలో జరిగిన కిడ్నాప్ ఘటనను కేవలం 4 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.కిడ్నాప్ చేసిన గుంతకల్లు తెదేపా మాజీ కౌన్సిలర్ సంజీవ్​తో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి కిడ్నాప్​నకు ఉపయోగించిన ఒక స్కార్పియో వాహనంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ రాజశేఖర్​రెడ్డి తెలిపారు.

* అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.ఈఎస్‌ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.బెయిల్‌ మంజూరు చేయాలంటూ గతంలో అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది.మరోవైపు  ఏసీబీ అదుపులో ఉన్న అచ్చెన్నాయుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

* మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను సోమవారం రాత్రి నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.