Kids

ద్వంద్వార్థ వాక్యాలు-తెలుగు భాష మకరందం

ద్వంద్వార్థ వాక్యాలు-తెలుగు భాష మకరందం

1.మీ సంగతి ఏమిటి?
మీసం గతి ఏమిటి?
2.గురూజీ వనం బాగుందా?
గురూ జీవనం బాగుందా?
3.మాట మాట పెరిగింది.
మా టమాట పెరిగింది.
4.మాతా తమరు నిమిషంలో చేరారు.
మా తాత మరునిమిషంలో చేరారు.
5.నావ లతలపై పడింది.
నా వల తలపై పడింది.
6.రామారావుంటే నేను వస్తాను.
రామా రా వుంటే నేను వస్తాను.
7.ఆమె కవితలతో జీవనం చేయును.
ఆమె కవి తలతో జీవనం చేయును.
8.మాతా మరను పట్టుకో.
మా తామరను పట్టుకో.