Sports

మైదానంలో ఇండియా-పాక్ పోరు ప్రపంచానికి మంచిది

మైదానంలో ఇండియా-పాక్ పోరు ప్రపంచానికి మంచిది

భారత్‌-పాకిస్థాన్ దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అభిప్రాయపడ్డాడు. 2013 జనవరిలో పాక్‌ జట్టు భారత్‌లో కొచ్ రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్‌ల సందర్భంగానే తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్‌లో ఇరు జట్లూ చివరి సారి టెస్టు సిరీస్‌ ఆడాయి. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మణి ఇలా స్పందించాడు.