కుడి లేదా ఎడమచేతికి ఓ వాచీ పెట్టుకుంటే అదో అందం. కానీ వాచీని చేతులకే ఎందుకు పెట్టుకోవాలనే సందేహం ఎవరికైనా వచ్చిందో రాలేదో కానీ… డిజైనర్లకు మాత్రం వచ్చింది. అందుకే ఇప్పుడు వాచీ డయల్స్‌కు అదనపు హంగులు చేర్చి వాటిని ముచ్చటైన ఇయర్‌రింగ్స్‌గా మార్చేస్తున్నారు. వాచీలను ఎలా పెట్టుకుంటాం అనే సంకోచం లేకుండా డయల్స్‌ని వీలైనంత చిన్నగా మార్చి… వాటికి విలువైన రాళ్లూ బంగారం పూలతలూ జతచేస్తున్నారు. దాంతో అవి స్టడ్స్‌లానే కాదు, హూప్స్, హ్యాంగింగ్స్ డిజైనులోనూ కనికట్టు చేస్తున్నాయి. కాస్త ట్రెండీగా కనిపించాలనుకున్నప్పుడు వీటిని పెట్టుకుంటే సరి.
చెవుల మీద గడియారం

Related tags :